NZB | మీరు అభివృద్ధి చేయరూ.. మమ్మల్ని చేయనీయరూ!.. ధర్మపురి అరవింద్

ప్రజా సంక్షేమం కోసం అభి వృద్ధి చేద్దామంటే… మీరు చేయరూ.. మమ్మల్ని చేయనీయరూ గిదేం పని అని ఎంపీ ధర్మపురి అర వింద్ ప్రశ్నించారు. పార్టీల ను పక్కనపెట్టి జిల్లా మధ్యలో అందరికీ సౌక ర్యంగా ఉండేలా నవోద య విశ్వవిద్యాలయ ఏర్పాటుకై అందరూ ఎమ్మెల్యేలతో చర్చించిన తర్వాతనే ప్రపోజల్ పంపి తే.. రూరల్ నియోజకవర్గ కాదని బోధన్ లోని నిజాం సుగర్ భూమిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనల ను మార్చి బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్ రెడ్డి ప్రపోజ ల్ పంపి అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. శని వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ తో కలిసి ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి 7 జవహర్ నవోదయ విశ్వవిద్యాల యాలను కేటాయించా రు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో రెండు విశ్వవిద్యా లయాలు మంజూరయ్యా యని చెప్పారు. ఈ విశ్వ విద్యాలయ ఏర్పాటుకై రెండు జిల్లాల్లోని ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో కూడా చర్చించడం జరిగిం దన్నారు.

దీంతో జగిత్యా ల జిల్లాలో అందరూ ఒకే చెప్పడంతో అక్కడ విశ్వ విద్యాలయ ఏర్పాటుకు క్లియరెన్స్ వచ్చిందని ఎం పీ చెప్పారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయ ఏర్పాటు ఆర్మూర్ నియోజకవర్గం లో చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కోరినట్లు తెలిపారు. కానీ నిజామా బాద్, బోధనలో విశ్వవిద్యాలయాలు ఉన్నందున అందరికీ సౌకర్యంగా ఉండేలా జిల్లా కు మధ్యలో అందరికీ అనుకూలంగా ఉన్న రూరల్ నియోజకవ ర్గంలోని జక్రాన్ పల్లి మం డలం కలిగోట్లో గల 30 ఎకరాల స్థలాల్లో విశ్వ విద్యాలయ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తో కూడా చర్చించామని చెప్పారు. అందరితో చర్చించిన అనంతరమే కలిగొట్లో విశ్వవిద్యాలయ ఏర్పాటుకు స్థానిక తహసిల్దార్ నుంచి జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వరకు ప్రతిపా దనలు సిద్ధం చేస్తే కానీ కలిగోట్లో కాదని బోధన్ లో ఆల్రెడీ విశ్వవి ద్యాల యం ఉన్న ఎమ్మె ల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ లోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ స్థలంలో విశ్వవి ద్యాలయ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పంపి అడ్డుకోవడాన్ని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణకు కేటాయించిన 7 విశ్వ విద్యాలయాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా క్లియరెన్స్ కూడా పూర్త యింది. కానీ నిజామాబా ద్ లో విశ్వవిద్యాలయ ఏర్పాటూలో కాంగ్రెస్ నాయకుల దిగజారుడు రాజకీయాలకు రిజెక్ట్ అయిందని మండిప డ్డారు. తప్పుడు స్థలం చూయించి నవోదయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కు రాకుండా కాంగ్రెస్ నాయకుల తీరు.. చేతగానితనానికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలు..

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలని ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. వాళ్లు చేయాల్సిన పనులు కూడా నేనే చేస్తుంటే సంతోషించాలి కానీ అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. రూరల్ నియో జకవర్గానికి మంజూరైన నవోదయ విశ్వవిద్యాల యాన్ని బోధన్ లో ఏర్పా టు చేయాలని ప్రపోజల్ పంపితే అసలు రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తుండని ప్రశ్నించారు.కేంద్రం నుంచి మంజూరైన విద్యాలయా లను ఆర్మూర్, నిజామా బాద్ అర్బన్ నియోజక వర్గాలను పక్కనపెట్టి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటుకు కృషి చేస్తుంటే అడ్డుకోవడం ఏమిటి అని ప్రశ్నించారు.

ఫ్యాక్టరీ భూములు ప్రైవేటీవి ఎలా ఇస్తారు.?.

అసలు షుగర్ ఫ్యాక్టరీ భూములు ప్రైవేటువి ఎలా విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ఇస్తారు చెప్పా లని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రశ్నిం చారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఉండి… గిది కూడా తెలి యదా అని అన్నారు. రిజెక్ట్ అవుతుందని అధికారులు చెప్పిన పెడ చెవిన పెట్టి నా మాటే వినాలంటూ…8 ఎకరాల్లో ని షుగర్ ఫ్యాక్టరీ భూము లలో కేంద్ర విశ్వవిద్యాల య ఏర్పాటు చేయాలని ప్రపోజల్ పంపడం పై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై తీవ్రస్థా యిలో మండిప డ్డారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకుండా బోధ న్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సొంతగా ఇథనాల్ ఫ్యాక్ట రీ పెట్టుకోవాలనీ ప్రయత్ని స్తున్నారని ఆరోపించారు.


నయా పైసా అభివృద్ధి చేయని మీరు చేసే అభి వృద్ధిని అడ్డుకోవడం ఏమి టన్నారు. నిజామాబాద్ పట్టణంలో ఉన్న స్టేడియం గూలగొ డుతివి… కొత్తది తీసు కొస్తా అన్నావ్ అది ఏమాయే అని సుదర్శన్ రెడ్డిని ఎంపీ ప్రశ్నించారు. అధికారులను తిట్టడం.. నాయకులను చీదరించు కోవడం… బోధన్ ఎమ్మె ల్యే తీరు మార్చుకోవాలని ఎంపీ సూచించారు.గీసుం టి పెద్దాయనని సీఎం రేవంత్ రెడ్డి నువ్వు నమ్ముకుంటే ఆల్రెడీ ముని గినావు… ఇంకా నిండా నిన్ను ముంచేస్తారని హితవు పలికారు సమా జానికి కాంగ్రెస్ నాయ కులు చీడపురుగులని ఎంపీ విమర్శించారు. కాంగ్రెసోళ్లు ఖుల్లా చెప్తుం డ్రు ఫ్యాక్టరీ భూములను విద్యాలయానికి ఇస్తా అని.. ఈ లెక్కన కాంగ్రెస్ వాళ్లకు ఫ్యాక్టరీ ప్రారంభిం చే ఉద్దేశం లేదన్నట్టే. రైతు సంఘాలు రైతులు ఆలోచించుకోవాలి మరి..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం కార్యకర్తలదే…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తల సమిష్టి కృషి ఫలితమే బిజెపి ఎమ్మెల్సీ అభ్య ర్థుల విజయానికి ప్రధాన కారణం అన్నారు. ఎన్ని కల్లో నుంచి 85 శాతం ఓట్లు పడ్డాయి అంటే.. ప్రధాని మోడీ నాయక త్వంలో బిజెపి పై ప్రజల కు ఉన్న నమ్మకమే అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఇదే రిపీట్ అవుతుంద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉం దో తెలిసిపోయింద న్నారు. వచ్చే స్థానిక సంస్థ ల ఎన్నికల్లోను విజ యం మాదేనని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు లక్ష్మీ నారాయణ, వడ్డీ మోహన్ రెడ్డి బిజెపి నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *