Yoga | ఘనంగా ధ్యాన దినోత్సవ వారోత్సవాలు…

Yoga | ఘనంగా ధ్యాన దినోత్సవ వారోత్సవాలు…
Yoga | మక్తల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం, డిసెంబర్ 21 నుండి ధ్యాన వారోత్సవాల్లో భాగంగా ఇవాళ మక్తల్ పట్టణంలోని స్కాలర్స్(Scholars) జూనియర్ కళాశాలలో ధ్యాన దినోత్సవ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ ఎస్ వై సాధకులు ఆచార్య ప్రకాష్ జీ గురూజీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ధ్యానం విశిష్టత, ప్రాముఖ్యత గురించి సవివరంగా వివరించారు. యోగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారన్నారు. ప్రతినిత్యం యోగా(Yoga) మనిషి జీవితంలో ఒక భాగం కావాలని సూచించారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య ప్రకాష్ జీ గురూజీతో పాటు కళాశాల కరస్పాండెంట్ అంజిరెడ్డి, ఎస్ ఎస్ వై యోగ సాధకులు కట్ట సురేష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
