Yoga Day | అంద‌రం క‌లిసి యోగా దినోత్స‌వం జ‌రుపుకుందాం – ప్ర‌జ‌ల‌కు మెగాస్టార్ పిలుపు

హైద‌రాబాద్ – ప్రపంచానికి భారత్‌ (Bharat) ఇచ్చిన బహుమతి యోగా (yoga) అని మెగా స్టార్ చిరంజీవి (Megastar Chirnajeevi) అన్నారు. ఈ నెల 21న యోగా దినోత్స‌వం సంద‌ర్భ‌గా ఆయ‌న త‌న ఎక్స్ ఖాతా ద్వారా ప్ర‌జ‌ల‌కు సందేశం ఇచ్చారు. జూన్‌ 21న యోగా దినోత్సవాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు . యోగా చేస్తే ఫిట్ నెస్ (fitness) తో పాటు ఆరోగ్యవంతంగా(health) కూడా ఉంటామ‌ని తెలిపారు

కాగా, యోగాకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ యోగా మాసోత్సవాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యోగా డేను నిర్వహిస్తున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi) కూడా హర్షం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో (Andrapradesh) యోగా దినోత్సవంపై ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని నరేంద్ర మోదీ అన్నారు. ఏపీ ప్రజలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈనెల 21న ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో యోగా ఉత్స‌వంలో ప్ర‌ధాని మోదీ పాల్గొన‌నున్నారు..

Leave a Reply