Yellandu | 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

Yellandu | 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

Yellandu | ఇల్లెందు, ఆంధ్రప్రభ : బీజేపీ మోడీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, రైతు వ్యతిరేక విత్తన చట్టం, నూతన విద్యుత్ చట్టం రద్దు చేయాలని, నరేగ బదులు తెచ్చిన వీ బీ జీ రాంజీ పథకం రద్దు చేయాలని కోరుతూ స్థానిక 21వ వార్డు స్టాలిన్ నగర్, 22వ వార్డు వినోబా భావే కాలనిలో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఐ టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ నబి పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేసే వరకు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసి, ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీజీ రాంజీ పేరుతో తెస్తున్న పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకురాలు కల్లేపల్లి, అధ్యక్షతన జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం సీఐటీయూ21, 22 వార్డుల కమిటీలు వేశారు. 21వార్డు కన్వీనర్ గా చెంచల వెంకన్న, 22వార్డు కు కోలపురి వేణులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేటి సంధ్య, కడారీ వెంకటమ్మ, యాకమ్మ, దాసరి దేవేంద్ర, వంగాల మాధవి, కొర్లపాటి దాసు, రేణుక, భరత్, రాయి కిరణ్, సంపూర్ణ, శాంత, సువర్ణ, రమణ, మానస అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, మున్సిపాలిటీ, హాస్పటల్, ఆటో, ఫుట్పాత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply