35 గేట్లు ఎత్తివేత
గోదావరిఖని, ఆంధ్రప్రభ : శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampally Project)కు భారీగా ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఈ రోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు (Sriram Sagar Project), కడెం ప్రాజెక్టు (Kadem Project)కు సంబంధించిన వరద గేట్లు తెరవడంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నవరద ఎల్లంపల్లి ప్రాజెక్టు చేరుకుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుకు సంబంధించిన 35 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేయడంతో రెండు లక్షల క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి 15,518 క్యూసెక్కుల నీరును దిగువకు విడిచిపెడుతున్నారు. ఆ నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులో కి చేరుతోంది. ఎల్లంపల్లి నుంచి గోదావరిలోకి నీరు విడిచిపెడుతున్నారు. గోదావరి (Godavari) పరివాహక ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదిలో చేపలు పట్టేవారు, గొర్రెలు, పశువుల కాపరులు నదిలోకి వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.
ఎల్లంపల్లిలో నీటి మట్టం
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 147.93 అడుగులు
నీటి నిల్వలు
ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 20.175 టీఎంసీ
ప్రస్తుత నీటి నిల్వ 19.9809 టీఎంసీలు
నీటి సరఫరా
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై కి 306 క్యూసెక్కులు
రామగుండం ఎన్‌టీపీసీ విద్యుత్ థర్మల్ ప్రాజెక్టుకు 121 క్యూసెక్కులు

