year | ఘనంగా మొక్కుబడి ప్రభ గ్రామోత్సవం

year | ఘనంగా మొక్కుబడి ప్రభ గ్రామోత్సవం

year | శావల్యాపురం, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ శైవక్షేత్రంలో జరుగుతున్న తిరునాళ్ళ వేడుకలకు మండలంలోని కొత్తలూరు గ్రామం నుండి భక్తులు మొక్కుబడి ప్రభను నిర్మించారు. వందేళ్ళకు పైగా చరిత్ర కలిగిన మొక్కుబడి ప్రభను ఈ ఏడాది కావూరి వంశస్థులు ప్రభను నిర్మించినట్లు స్థానికులు తెలిపారు.

మహిళలు ఆదివారం ఉదయం ప్రభ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందీశ్వరునికి భక్తులు ప్రత్యేక పూజలు చేసి ప్రభల ముందు అలంకరించి, మేళతాళాలతో గ్రామపురవీధుల్లో ఊరేగిస్తూ అంగరంగ వైభవంగా గ్రామోత్సవాన్ని నిర్వహించి, మేళతాళాలతో ప్రభను కోటప్పకొండకు తరలించారు.

year |

Leave a Reply