YCP MLC | ఏమైందంటే…

YCP MLC | ఏమైందంటే…
YCP MLC | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మరోసారి ఆందోళనకర వాతావరణం నెలకొంది. విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (YCP MLC Botsa Satyanarayana) మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. సభా సమావేశాల సమయంలో ఆయనకు ఆకస్మికంగా బీపీ హెచ్చుతగ్గులు రావడంతో అధికారులు వెంటనే అసెంబ్లీ వైద్యులను (Assembly physicians) పిలిపించారు.
డాక్టర్లు పరీక్షించిన తర్వాత బీపీ సమస్య (BP problem) వల్లే ఈ అస్వస్థత ఏర్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. మెరుగైన చికిత్స కోసం ఆయనను హైదరాబాద్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం. బొత్స సత్యనారాయణ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని అభిమానులు, రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు.
