మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ ఇంచార్జి కిట్టు పర్యటన

మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ ఇంచార్జి కిట్టు పర్యటన

(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి): మొంథా తుఫాన్ ప్ర‌భావంతో పంట న‌ష్ట‌పోయిన రైతుల‌కు త‌క్ష‌ణ సాయం అందించాల‌ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ ఇంచార్జి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) ప్ర‌భుత్వాన్ని కోరారు. మచిలీపట్నం మండలంలో పోతేపల్లి, అరిసేపల్లి, చిట్టి పాలెం గ్రామాలలో మొంథా తుఫాన్ ప్రభావంతో పంటలు తీవ్ర నష్టం చవిచూసిన పొలాలను శుక్ర‌వారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ వల్ల పంటలు దెబ్బతిన్న రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు చేపట్టాలని కోరారు. ఒక్కో రైతు 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. పంట గింజ పాలు పోసుకునే దశలో ఉండడంతో రైతులకు అపార నష్టం జరిగిందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాలలో పంట నష్టం పోయిందని తెలిపారు. నష్టపరిహారం విషయంలో సమగ్ర పరిశీలన చేసి రైతాంగానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షులు మట్టా నాంచారయ్య, రైతు అధ్యక్షులు గడిదేసి రాజు, కృష్ణాజిల్లా వైయస్సార్సీపీ జనరల్ సెక్రెటరీగణేషణ రమేష్, పోతేపల్లి ఇంచార్జ్ పిప్పళ్ల‌ నాగబాబు, అరిసేపల్లి ఇంచార్జ్ అజయ్, సాక్షి సత్యనారాయణ, రామకృష్ణ, పరింకాయల అశోక్,పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply