స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి…

స్వర్ణకారులు అన్ని రంగాల్లో ఎదగాలి…

స్వర్ణకార సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలా చారి

మోత్కూర్, ఆంధ్రప్రభ : స్వర్ణకారులు అన్ని రంగాలలో ఎదగాలని స్వర్ణకార సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొండపర్తి బాలా చారి అన్నారు . ఆదివారం మోత్కూరు మండల స్వర్ణకార సంఘం ఎన్నికలను స్థానిక ఉన్నత పాఠశాలలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో బాల చారి మాట్లాడుతూ స్వర్ణకారులు ఐక్యమత్యంతో రాజకీయ, విద్యా,సామాజిక ఆర్థిక రంగాలలో ఎదగాలని పిలుపునిచ్చారు.

ఎంతో ప్రతిభ కలిగిన స్వర్ణ కారులు సమాజంలో వెనుకబడి పోతున్నారని, ప్రభుత్వం కూడా వీరి అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన కాసోజు శ్రీకాంతచారి ఈ మండలానికి చెందిన వాడని ,అలాగే తెలంగాణ తొలి అసెంబ్లీ సభాపతి మధుసూదనాచారి, తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కె. జయశంకర్ సారు, తెలంగాణ తల్లి రూపశిల్పి బిఎల్ఎన్ చారి విశ్వకర్మ జాతికి చెందిన వారేనని ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వకర్మలు ఎంతో ముందుండి పోరాటం చేసినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విశ్వకర్మలకు ఒరిగిందేమీ లేదని బాలచారి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి ప్రత్యేకంగా విశ్వకర్మల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అమలులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. మోత్కూరు స్వర్ణకార సంఘం మండల వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులందర్నీ ఒకతాటిపైకి తెచ్చి స్థానికంగా సంఘ భవనం కోసం, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ స్థానికంగా స్వర్ణకారులంతా ఐక్యమత్యంతో ఉండి సమస్యల పరిష్కారం కోసం ఐక్యతగా కృషి చేయాలని కోరారు.

మోత్కూరు మండల స్వర్ణకార సంఘం నూతన కమిటీ ఎన్నిక…స్వర్ణకారుల సంఘం అధ్యక్షునిగా అక్కినేపల్లి వెంకటాచారి, ప్రధాన కార్యదర్శిగా మోత్కూరు జయ ప్రసాద్ రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారితో పాటు జిల్లా సంఘ నాయకులను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొల్లోజు శివకుమార్, మాజీ ఉపాధ్యక్షుడు బోగోజు నరసింహాచారి, ఎన్నికల ఇన్చార్జి కే శ్రీనివాస చారి, పూర్ణాచారి, స్థానిక విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు ఎం బ్రహ్మచారి, టి మనోహర చారి, సీనియర్ జర్నలిస్ట్లు ఎస్ ఎన్ చారి, చేపూరి అనిల్, ఆకవరం శ్రీనివాసచారి, సంఘ నాయకులు నరసింహ చారి, కొల్లోజు నరేందర్, షణ్ముఖ చారి, నవీన్, మోత్కూరు జగన్, బోగోజు రవి, సజ్జనం మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply