ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ మహిళలు ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించారు. లక్నో వేదికగి జరిగిన మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 177 పరుగులు నమోదు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (57 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్ 92) దంచికొట్టింది. షఫాలీ వర్మ (27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్ 40) రాణించింది.
ఇక 178 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విజయంలో హర్లీన్ డియోల్ (49 బంతుల్లో 70 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టింది. బెత్ మూనీ (44) ఆకట్టుకుంది. ఇక కెప్టెన్ ఆష్లీ గార్డనర్ (22), డియాండ్రా డాటిన్ (24) ధనాధన్ బౌండరీలతో మెప్పించారు.
ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. గుజరాత్ (8), ముంబై (8) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.