WPL 2025 | స్మృతి మందన బ్యాటింగ్ మెరుపులు – ఆర్‌సీబీ కి రెండో విజయం
వడోదర: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో బెంగళూరు జోరు కొనసాగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 142 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ సునాయాసంగా చేధించింది.
కెప్టెన్ స్మృతి మందన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించింది..ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2025 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని చేధించి సంచలన విజయాన్ని అందుకున్న బెంగళూరు రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 47 బంతుల్లో 81 పరుగులు చేసిన స్మృతి మందన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ 107 పరుగులతో మంచి ప్రారంభాన్ని అందించారు. స్మృతి మంధాన, డానియేల్ వ్యాట్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే 107 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. డానియేల్ వ్యాట్ 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యింది.
33 బంతుల్లో 42 పరుగులు చేసిన డానియేల్ అరుంధతి రెడ్డి బౌలింగ్‌లో జెమిమా రోడ్రిగ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. స్మృతి మందన 81 పరుగులు చేసిన అవుట్ అయ్యింది. శిఖా పాండే బౌలింగ్‌లో అరుంధతికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది..
అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్‌లో రెండవ బంతికే తొలి వికెట్‌ను కోల్పోయింది. రేణుకా సింగ్ బౌలింగ్‌లో స్మృతి మంధానకు క్యాచ్ ఇచ్చి షఫాలి వర్మ వర్మ వెనుదిగిరింది.
ఆ తర్వాత జెమిమా రోడ్రిగ్స్ డీసీ స్కోర్ బోర్డును పెరుగులు పెట్టించింది. 22 బంతుల్లో 34 పరుగులు చేసిన తర్వాత 6.5 బంతికి రిచా ఘోష్ చేతిలో స్టంప్ అవుట్ అయ్యింది. వెంటనే 7.3 బంతికి డీసీ మరో వికెట్ కోల్పోయింది డీసీ. కిమ్ గార్త్ బౌలింగ్‌లో కెప్టెన్ మెగ్ లానింగ్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న ఎలిస్ పెరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టింది.
మెగ్ లానింగ్ 19 బంతుల్లో 17 పరుగులు చేసింది.వరుసగా రెండు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులో ఉన్న అనాబెల్ సథర్లాండ్, యారిజాన్నే కాప్ స్కోర్‌ను పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. 17 బంతుల్లో 22 పరుగుల పాట్నర్‌షిప్‌ను అందించారు. అంతా సెట్ అవుతోందని అనుకుంటున్న సమయంలో అనాబెల్ 19 పరుగుల వద్ద రేణుకా సింగ్ బౌలింగ్‌లో స్మృతి మందనకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. ఆ తర్వాత వెంటనే జెస్ జోనాసెన్ రూపంలో డీసీ మరో వికెట్ కోల్పోయింది. కేవలం 1 పరుగుకే ఏక్తా బిష్త్ బౌలింగ్‌లో కనికాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. దీంతో ఢిల్లీ జంటు 100 పరుగుల లోపే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత 13.3 బంతికి డీసీ మరో వికెట్ కోల్పోయింది. మారిజాన్నే కాప్ ఏక్తా బిష్త్ బౌలింగ్‌లో వ్యాడ్ హాడ్జ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 19 బంతుల్లో 23 పరుగులు చేసి స్కోర్ బోర్డ్ పెంచే పనిలో పడ్డ సారా బ్రైస్ వేర్‌హామ్ బౌలింగ్‌లో స్టాంప్ అవుట్ అయ్యింది.
ఆ తర్వాత వెంటనే రాధా యాదవ్ క్యాచ్ ఇచ్చింది. ఇక చివరి వికెట్‌గా అరుధంతి రెడ్డి కిమ్ గార్త్ బౌలింగ్‌లో ఎలిస్ పెరీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది. దీంతో ఢిల్లీ క్యాపిటాల్స్ 141కి అలౌట్ అయ్యింది.
జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34) టాప్ స్కోరర్లుగా నిలిచారు.