❇ముంబై, ఢిల్లి మధ్య టైటిల్ ఫైట్
❇టాస్ గెలిచిన ఢిల్లీ !
మహిళల ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. నేడు ముంబై బ్రబౌర్న్ స్టేడియం వేదికగా డబ్ల్యూపీఎల్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఈ ఫైనల్ ఫైట్ లో వరుసగా మూడో సారి ఫైనల్స్ చేరిన ఢిల్లీ… మాజీ ఛాంపియన్ ముంబైతో తలపడనుంది.
ఇక పోతే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుని ముంబై జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో రెండో టైటిల్‌పై కన్నేసిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సేన.. తొలుత బ్యాటింగ్ చేయనుంది. మరోవైపు ఈసారి ఎలాగైనా ఫైనల్లో గెలిచిన కప్పును ఒడిసిపట్టాని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బరిలోకి దిగుతొంది.
హోరాహోరీగా ఫైనల్ !
కాగా, ముంబై జట్టు మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంటే.. ఈ సీజన్‌లో చిరస్మరణీయ ప్రదర్శనలతో రాణిస్తున్న ఢిల్లి క్యాపిటల్స్ రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఇరుజట్లు స్టార్ ఆటగాళ్లతో నిండిఉండటంతో ఈ ఫైనల్ పోరు హోరాహోరీగా జరగడం ఖాయమనిపిస్తోంది.
జట్టులో మార్పులు:
ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో ఒక మార్పు చేసింది.. టైటాస్ సాధు స్థానంలో నల్లపురెడ్డి చరణి జట్టులోకి వచ్చింది.
ముంబై ఇండియన్స్ ఏ మార్పూ లేకుండా బరిలోకి దిగుతొంది.
తుది జట్లు :
ముంబై ఇండియన్స్ : యస్తికా భాటియా (వికెట్ కీపర్), హేలీ క్రిస్టెన్ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమేలియా కెర్, అమంజోత్ కౌర్, సజీవన్ సజన, జీ.కమలిని, షబ్నిమ్ ఇస్మాయిల్, సంస్కృతి గుప్తా, సైకా ఇషాక్.
ఢిల్లీ క్యాపిటల్స్ వుమెన్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెస్ జోనాసెన్, జెమిమా రోడ్రిగ్స్, అన్నాబెల్ సదర్లాండ్, మారిజాన్ కాప్, నికి ప్రసాద్, సారా జెన్నిఫర్ బ్రైస్ (వికెట్ కీపర్), శిఖా పాండే, మిన్ను మణి, నల్లపురెడ్డి చరణి.