New district | వావ్ మదనపల్లె

వావ్ మదనపల్లె

ఇక కొత్త జిల్లాగా అవతరణం

  • జిల్లా కేంద్రం రాజంపేట
  • అన్నమయ్యకు బద్వేలు అదనం ?
  • రెవెన్యూ డివిజన్‌ .. పీలేరు

New district | ( అన్నమయ్య, ఆంధ్రప్రభ బ్యూరో ) : ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న కొత్త జిల్లాల ఖరారు రానే వచ్చింది. అన్నమయ్య జిల్లాలో అనుకున్నదే జరిగింది. మదనపల్లె కొత్త జిల్లాగా ఏర్పాటు- అయింది. అందరూ ఊహించినట్టు- కొత్తగా ఆరు జిల్లాలు ఏర్పాటు- అవుతాయి అనుకున్నట్టు- కాకుండా కేవలం మూడు మాత్రమే కొత్త జిల్లాలను ఏర్పాటు- చేస్తూ రాష్ట్రంలో మొత్తం జిల్లాలను 29 గా మార్చారు. ఈ మేరకు సబ్‌ కమిటీ- ఇచ్చిన నివేదికకు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆమోదం తెలిపారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరికొన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు- చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను రాష్ట్ర మంత్రివర్గంలో ఆరుగురు మంత్రులతో ఒక సబ్‌ కమిటీ-ని కూడా ఏర్పాటు- చేసింది. ఈ సబ్‌ కమిటీ- రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రాంతాలవారీగా ప్రజల మనోభావాలను తెలుసుకొని, కొత్త జిల్లాల ఏర్పాటు-, రెవెన్యూ డివిజన్ల ఖరారు, కొత్త మండలాల ఏర్పాటు- వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది. మధ్యంతరంగా నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై చర్చలకు కూడా అవకాశం ఇచ్చింది.
దీనిపై సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికలో కొన్ని మార్పు చేర్పులను చేసి కొత్త జిల్లాలను ఖరారు చేశారు. రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలను ఏర్పాటు- చేయాలని నిర్ణయించారు. అందులో అన్నమయ్య జిల్లాకు చెందిన మదనపల్లె ఉండడం విశేషం.

కొత్త జిల్లాగా మదనపల్లి

రాష్ట్రంలో ఏర్పాటు- అవుతున్న కొత్త జిల్లాల లో రాష్ట్ర ప్రభుత్వం మదనపల్లి ని ఖరారు చేసింది. పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు నాలుగు నియోజకవర్గాలకు కేంద్రంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా చేస్తూ సబ్‌ కమిటీ- ఇచ్చిన నివేదిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదించారు. ఇకనుంచి అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లె రెవెన్యూ డివిజన్‌ తో పాటు- చిత్తూరు జిల్లాలోని పుంగనూరు కూడా కలిసి కొత్త జిల్లాగా ఆవిర్భవించనుంది. నైసర్గిక స్వరూపంగా మదనపల్లె జిల్లాలో 27 మండలాలు ఉండేలా మంత్రివర్గ ఉప సంఘం తన నివేదికలో పేర్కొంది. ఇదిలా ఉండగా జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లు ఉండాలని మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం మదనపల్లి జిల్లాలో పీలేరును రెవెన్యూ డివిజన్‌ గా మారుస్తూ ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు.

అన్నమయ్యకు బద్వేలు అదనం

ఉమ్మడి అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లి జిల్లా విడిపోవడంతో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాలు మాత్రమే మిగులుతున్నాయి. ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి తో పాటు- పుంగనూరు కూడా కలిసి కొత్త జిల్లాగా ఏర్పాటయింది. ఇక అన్నమయ్య జిల్లాలో కోడూరు, రాజంపేట, రాయచోటి నియోజక వర్గాలు మాత్రమే మిగిలాయి.
17 మండలాలు మాత్రమే అన్నమయ్య జిల్లాలో మిగులుతున్నాయి. నైసర్గిక స్వరూపంగా అన్నమయ్య జిల్లాలో మరో నియోజకవర్గాన్ని కలపడానికి అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం కడప జిల్లాలోని బద్వేలు అయితే అన్నమయ్య జిల్లాకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటు-ందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇందులో బద్వేలు నియోజకవర్గం కలిస్తే ఈ జిల్లాలో కూడా నాలుగు నియోజకవర్గాలతో పాటు- సుమారు 23 నుంచి 25 మండలాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

జిల్లా కేంద్రంగా రాజంపేట

అన్నమయ్య జిల్లాకు సౌకర్యవంతమైన పరిపాలన కేంద్రంగా రాజంపేట అయితే బాగుంటు-ందని అన్నమయ్య జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి కొనసాగుతోంది. మదనపల్లె జిల్లా విడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా రాజంపేట నిలుస్తోంది. రాజంపేట నుంచి రైల్వే కోడూరు 50 కిలోమీటర్ల దూరానికి లోపల ఉంటు-ంది. కడప 60 కిలోమీటర్ల లోపే ఉంటు-ంది. రాయచోటి కూడా 60 కిలోమీటర్ల లోపే ఉంటు-ంది. బద్వేలు కూడా ఇంచుమించుగా 70 కిలోమీటర్ల దూరం ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటనే ఏర్పాటు- చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు- తెలుస్తోంది.

రాష్ట్రంలో కొత్త జిల్లాల పేర్లను ప్రకటించిన తరుణంలో రాజంపేట లేదు కదా అని పలువురు చర్చించుకుంటు-న్న నేపథ్యంలో ముందుగానే ఏర్పాటు- చేసిన అన్నమయ్య జిల్లాలో జిల్లా కేంద్రాన్ని మారుస్తున్నారు కాబట్టి దానిని ప్రకటించాల్సిన అవసరమే లేదని కొందరు వారికి సమాధానం చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే వైసీపీ ప్రభుత్వంలో కొత్త జిల్లాలను ఏర్పాటు- చేసిన సమయంలో నైసర్గిక స్వరూపంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను కాకుండా రాయచోటిని చేయడం వెనుక చుట్టు-పక్కల నియోజకవర్గాలకు కేంద్రంగా ఉంటు-ందని అప్పట్లో కారణం చెప్పారు.
రాయచోటి జిల్లా కేంద్రం చేయడంపై ఎన్నో వ్యతిరేకతలు వచ్చినా అప్పటి పాలకులు దీనిని. సరి కదా. కూటమి ప్రభుత్వం ఏర్పాటు- చేసిన కొత్త జిల్లాల తర్వాత అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటే ఆ జిల్లాలో ఉన్న తక్కిన నియోజకవర్గాలు రాయచోటికి దూరమయ్యే అవకాశాలు ఉండటం వల్ల జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి రాజంపేటకు మార్చడం తథ్యం అని అధికార వర్గాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ విభాగాలు ఇప్పటికే ఆ శాఖల ఉన్నతాధికారుల సూచనల మేరకు రాజంపేటలో జిల్లా కార్యాలయాలను ఏర్పాటు- చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు ప్రారంభించాయి. అంతేకాదు కూటమి ప్రభుత్వంలో కీలకమైన అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక కూటమి నాయకుడు కూడా రాజంపేట జిల్లా కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వ స్థాయిలో చర్చలు సాగుతున్నాయని కూడా వివరించడం విశేషం.

Leave a Reply