TEMPLE | నందీశ్వ‌రుడికి పూజ‌లు

TEMPLE |నందీశ్వ‌రుడికి పూజ‌లు

మహానంది ఆల‌యాన్నిసంద‌ర్శించిన‌ జాయింట్ కలెక్టర్

TEMPLE |నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది సన్నిధిలో జాయింట్ కలెక్టర్ (Joint Collector) కొల్లా బత్తుల కార్తీక్ దంపతులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ ఏఈఓ మధు స్వాగతం పలికారు. జెసి దంపతులు స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను (Pooja activities) నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం జేసీ దంపతులను సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహానందేశ్వరుని సన్నిధిలో జిల్లా అభివృద్ధి పథంలో పయనించేలా చేయాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ వెంట మహానంది త‌హ‌సీల్దార్ రమాదేవి, ఆర్‌ఐ సుబ్బారావు, వేద పండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, ఆలయ సూపరింటెండెంట్ శశిధర్ రెడ్డి, నీలకంఠరాజు మహానంది వీఆర్వో చలమయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply