లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు..

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు..

మాచారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి (Machareddy) మండలంలోని చుక్కాపూర్ గ్రామంలో గల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పలు ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఆలయ ప్రధాన పూజారి నరసింహ చారి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది.

Leave a Reply