అమరావతిలో వరల్డ్ టూరిజం డే

అమరావతిలో వరల్డ్ టూరిజం డే
అమరావతి, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతి ధ్యాన బుద్ధ ప్రాంగణం(Meditating Buddha Precinct) వద్ద గుంటూరు(Guntur) జిల్లా టూరిజం అధికారి నాయుడమ్మఅమరావతి మండల పరిషత్(Mandal Parishad) అభివృద్ధి అధికారి టి. పార్వతి, అమరావతి మండల తహసీల్దార్ ఎం. డానియల్(M. Daniel) ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి, మొక్కలు నాటి కార్యక్రమాన్నిశనివారం చేపట్టారు.
ఈ సందర్భంగా అమరావతి మండల పరిషత్ అభివృద్ధి అధికారి టీ. పార్వతి(T. Parvati) మాట్లాడుతూ పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని, ప్రతి ఒక్కరూ పర్యావరణ సంరక్షణలో భాగం పంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి మండల విద్యాశాఖ అధికారి(Education Officer), కేఎస్ఎన్ ప్రసాద్, సిహెచ్. శివ బాబు, అమరావతి మండల డిప్యూటీ ఎంపీడీవో కె. పద్మజ(MPDO K. Padmaja) పంచాయితీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
