End Of Trophy Drought | ట్రోఫీల దాహం తీరుస్తున్న 2024-25 సీజన్ !

  • ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిన ప్రపంచ క్రీడా జట్లు

హైదరాబాద్ : 2024-25 క్రీడా సీజన్ అనేక అద్భుత విజ‌యాల‌కు వేదిక‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జట్లు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తమ గెలుపు గమ్యాన్ని చివ‌ర‌కు చేరాయి. కొన్ని జట్లకు ఈ సీజ‌న్ తొలి టైటిల్ అందించ‌గా.. మరికొన్నింటికి దశాబ్దాల నిరీక్షణకు ముగింపు లభించింది. ప్రపంచ క్రీడా జట్లు సాధించిన‌ ఈ విజయాలు అభిమానుల కలలను నిజం చేస్తూ, వేడుకలకు దారితీశాయి.

ట్రోఫీ క‌ల‌ను నిజం చేసిన జ‌ట్లు ఇవే !

క్రికెట్ !

🔸 షెఫీల్డ్ షీల్డ్ (ఆస్ట్రేలియా) – సౌత్ ఆస్ట్రేలియా
29 ఏళ్ల తర్వాత షెఫీల్డ్ షీల్డ్‌ను ముద్దాడిన సౌత్ ఆస్ట్రేలియా, 1996లో వచ్చిన చివరి టైటిల్ తర్వాత మొదటిసారి విజయం సాధించింది.

🔸 బిగ్ బాష్ లీగ్ (BBL) – హోబార్ట్ హరికేన్స్
14 ఏళ్ల నిరీక్షణకు తెరదించి, హోబార్ట్ హరికేన్స్ తమ తొలి BBL ట్రోఫీని గెలుచుకుని అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

🔸 కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) – సెయింట్ లూసియా కింగ్స్
11 సంవత్సరాల తర్వాత తమ తొలి టైటిల్ సాధించిన సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమేజాన్ వారియర్స్‌ను ఓడించి చరిత్ర సృష్టించింది.

🔸 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)
18 ఏళ్ల కలను సాకారం చేసుకున్న RCB, పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందుతూ తన తొలి IPL టైటిల్‌ను ముద్దాడింది. కోహ్లీ నేతృత్వంలో వేలాది అభిమానులకు ఇది మరిచిపోలేని సంబరం.

🔸 వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC 2023-25) – దక్షిణాఫ్రికా
27 ఏళ్ల అనంతరం ICC ట్రోఫీ సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా, లార్డ్స్ వేదికగా ఆసీస్‌ను ఓడించి టెస్ట్ చాంపియన్లుగా అవతరించింది.

ఫుట్‌బాల్ !

🔹 UEFA చాంపియన్స్ లీగ్ – PSG
1970లో స్థాపితమైన ఫ్రెంచ్ క్లబ్ ప్యారిస్ సెంట్ జర్మేన్ (PSG) తొలిసారిగా చాంపియన్స్ లీగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. 55 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ చారిత్రక విజయంతో, యూరోప్ ఫుట్‌బాల్ వేదికపై PSG తన సత్తా చాటింది.

🔹 యూరోపా లీగ్ – టోట్నమ్ హాట్స్పర్
2008 తర్వాత ఒక్కటైనా ట్రోఫీ అందుకోని టోట్నమ్ హాట్స్పర్ జట్టు, 17 ఏళ్ల విరామానికి చెక్ పెట్టి యూరోపా లీగ్‌ను గెలుచుకుని తమ పునరాగమనం ఘనంగా ప్రకటించింది.

🔹 ఎఫ్.ఎ కప్ – క్రిస్టల్ ప్యాలెస్
114 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెరదించి, క్రిస్టల్ ప్యాలెస్ తొలిసారిగా FA కప్‌ను గెలుచుకుంది. ఇది క్లబ్ చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా నిలిచింది.

🔹 ఇఎఫ్‌ఎల్ కప్ (కరబావో కప్) – న్యూకాసిల్ యునైటెడ్
70 సంవత్సరాల విరామానికి తెరదించిన న్యూకాసిల్ యునైటెడ్, కరబావో కప్‌ను గెలుచుకుని అభిమానుల కలను నెరవేర్చింది.

🔹 బుండెస్లిగా – బయ్యర్న్ మ్యూనిక్
ఇంగ్లాండ్ స్టార్ హ్యారీ కేన్ తన కెరీర్‌లో తొలిసారి లీగ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇది అతని క్లబ్ కెరీర్‌లో ఒక మైలురాయి ఘట్టంగా నిలిచింది.

ఈ విధంగా, చాలా సంవత్సరాలుగా ట్రోఫీని గెలవలేకపోయిన జట్లు చివరకు 2024-25 క్రీడా సీజన్‌లో తమ కలల ట్రోఫీలను గెలుచుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *