నాలుగు రెట్లు ప్రైజ్ మనీ..!

ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్: మహిళల క్రికెట్ కు ఐసీసీ బంపరాఫర్ ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో మొదలవనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ ( Prize Money) పూలన్ ను ఏకంగా నాలుగు రెట్లు పెంచేసింది. ఇది 2023 పురుషుల వన్డే వరల్డ్ కప్ ప్రైజ్ పూల్ కన్నా ఎక్కువ కావడం గమనార్హం. ఈసారి జరిగే మహిళల వరల్డ్ కప్ (World Cup 2025) ప్రైజ్ ఫూల్ ను 13.88 మిలియన్ డాలర్ల (సుమారు రూ.122 కోట్లు)గా ఐసీసీ ప్రకటించింది. 2023 పురుషుల వరల్డ్ కప్ పైజ్ పూల్ 10 మిలియన్ డాలర్లే (సుమారు రూ.88.26 కోట్లు) కావడం గమనార్హం. అంతేకాదు, చివరగా జరిగిన మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ పూల్ కేవలం రూ.31 కోట్లే. దీన్ని సుమారు నాలుగు రెట్లు పెంచింది ఐసీసీ.

మొత్తం పది టీమ్స్ పాల్గొనే మహిళల వరల్డ్ కప్ సెప్టెంబరు 30న మొదల వుతుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలుత కేవలం భారత్ మాత్రమే ఆతిథ్య దేశంగా ఉంది. అయితే చాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచులను తటస్థ వేదికల్లో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో కేవలం ఒక్క మ్యాచ్ కోసం మరో దేశంతో డీల్ చేసుకోవడం కష్టం అవడంతో.. పలు మ్యాచులను శ్రీలంకకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ఆతిథ్య జట్టుగా శ్రీలంక కూడా చేరింది.

మహిళల వరల్డ్ కప్ మొత్తం ప్రైజ్ పూల్: సుమారు రూ.122 కోట్లు విజేతకు దక్కేది: 4.48 మిలియన్ డాలర్లు (సుమారు రూ.40 కోట్లు), రన్నరప్ ప్రైజ్ మనీ: 2.24 మిలియన్ డాలర్లు (సుమారు రూ.20 కోట్లు) సెమీ ఫైనలిస్టులకు దక్కేది: 1.12 మిలియన్ డాలర్లు (సుమారు రూ.10 కోట్లు) 5,6 స్థానాల్లోని జట్లు: 7 లక్షల డాలర్లు (సుమారు రూ.6.16 కోట్లు) 7,8వ స్థానాల్లో నిలిచిన జట్లు : 2.8 లక్షల డాలర్లు (సుమారు రూ.2.47 కోట్లు) పార్టిసిపేషన్ ప్రైజ్: 2.5 లక్షల డాలర్లు (సుమారు రూ.2.2 కోట్లు).

‘మహిళల క్రికెట్లో ఇదొక కీలకమైన మైలురాయిగా ఈ ప్రకటన నిలుస్తుంది. ప్రైజ్ మనీని ఇలా నాలుగు రెట్లు పెంచడం అనేది మహిళల క్రికెట్లో అసామాన్య ఘట్టం. మహిళా క్రికెట్ దీర్ఘకాల ఎదుగులకు మేం కట్టుబడి ఉన్నామని స్పష్టంచేస్తుంది. మా సందేశం సింపుల్. ప్రొఫెషనల్గా ఈ క్రీడను ఎంచుకనే మహిళలను కూడా పురుషులతో సమానంగా చూస్తామని చెప్పడమే మా లక్ష్యం. మహిళల క్రికెట్ కు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం అందించేందుకు మేం చేస్తున్న కృషికి మద్దతివ్వాలని అందరు భాగస్వాములు, ఫ్యాన్స్, మీడియా, సభ్య దేశాల బోర్డులను కోరుతున్నాం’ అని ఐసీసీ ఛైర్మన్ జై షా వెల్లడించారు.

ఇలా మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీని భారీగా పెంచడంపై లెజెండరీ పేసర్ ఝులన్ గోస్వామి స్పందించింది. ‘నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇది చాలా మంచి విషయం. నా తరఫున ఐసీసీకి ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. వాళ్ల ఆలోచనా విధానం చూస్తుంటే మహిళల క్రికెట్కు చాలా బూస్ట్ దక్కేలా ఉంది. ఎదుగుతున్న యంగ్ క్రికెట ర్లకు, వారి కుటుంబాలకు కూడా ఇది చాలా పెద్ద బూస్ట్. క్రికెట్ ఆడటంతో కూడా జీవితంలో ముందుకెళ్లొచ్చని వాళ్లకు నమ్మకం కలుగుతుంది. ప్లేయర్లను కూడా ఈ నిర్ణయం చాలా మోటివేట్ చేస్తుంది ‘ అని గోస్వామి పేర్కొంది.

Leave a Reply