గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి కృషి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తానని మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్ అన్నారు. సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మొగ్ధంపూర్ లో ఎస్సీ కార్పొరేషన్ నిధులు రూ. 4 లక్షలతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు.
ఎంపీడీకే అరుణ సహకారంతో గ్రామంలో ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామని ఎంపీ నిధులు తీసుకువచ్చి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. పాలకవర్గం సభ్యులు అన్ని పార్టీల నాయకులు అభివృద్ధికి సహకరించాలని8వ వార్డులో ఎస్సీ కార్పొరేషన్ నిధుల కింద సిసి రోడ్డు పనులు చేపడుతున్నామని అన్నారు. వేసవికాలంలో విద్యుత్ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నరేందర్, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, వార్డు సభ్యులు నర్సిములు, రాజు తదితరులు పాల్గొన్నారు.
