Workers | వస్త్రాలు, తోపుడు బళ్ళు పంపిణీ..

Workers | వస్త్రాలు, తోపుడు బళ్ళు పంపిణీ..
Workers | విజయవాడ, ఆంధ్రప్రభ : పేదలకు తోపుడు బండ్లు, పారిశుద్ధ కార్మికులకు వస్త్రాలను రేగళ్ల ఫౌండేషన్ బహుకరించింది. విజయవాడ (Vijayawada) పశ్చిమ నియోజకవర్గం 39వ డివిజన్లో మంగళవారం టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ రేగళ్ల లక్ష్మణరావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, దూదేకుల కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ నాగుల్ మీరా హాజరయ్యారు. ముఖ్య అతిధులు చేతుల మీద కేక్ కట్ చేసి రేగళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి చేతుల మీదుగా పేదలకు 3 తోపుడు పండ్లు, పారిశుద్ధ కార్మికులకు వస్త్రాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


