మహిళల ట్రై-నేషన్ వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం చేసింది. భారత్ – శ్రీలంక – సౌతాఫ్రికా మధ్య శ్రీలం వేదికగా నేటి నుంచి ట్రై-నేషన్ వన్డే సిరీస్ ప్రారంభమైంది. కాగా, ఈరోజు కొలంబో వేదికగా భారత్ – శ్రీలంక మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు బోణీ కొట్టింది. శ్రీలంకపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించిన హర్మన్ ప్రీత్ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
కాగా, నేటి మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించడంతో.. మ్యాచ్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో ఎంపైర్లు మ్యాచ్ ను 39 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బౌలింగ్ చేస్తోంది. భారత బౌలర్లు స్నేమ్ రానా, దీప్తి శర్మ, చరణి చెలరేగడంతో 38.1 ఓవర్లలో శ్రీలంక 147 పరుగులకే ఆలౌట్ అయింది.
148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హర్మన్‌ప్రీత్ సేన ఒక వికెట్ మాత్రమే కోల్పోయి.. 29.4 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించింది. టీమిండియా ఓపెనర్ ప్రతికా (50 నాటౌట్) అర్ధ శతకం సాధించగా.. మందాన (43), హర్లీన్ (48 నాటౌట్) దంచేశారు. దీంతో టీమిండియా చాలా సులువుగా విజయం సాధించింది.