women’s education | మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం…

women’s education | మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం…
women’s education | ఆర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్ మండలం గాంధీనగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్(Oxford School)లో మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సామాజిక సంస్కర్త భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళా విద్యకు, సామాజిక సంస్కరణలకు ఆమె చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా పాఠశాల కరస్పాండెంట్ మానస గణేష్ మాట్లాడుతూ…మహిళల విద్యకు(women’s education) సమాజం వ్యతిరేకంగా ఉన్న కాలంలోనే సావిత్రిబాయి ఫూలే మహిళలు, బాలికలకు విద్యను అందించేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సామాజిక సంస్కర్త అని పేర్కొన్నారు.
విద్య అనేది మహిళలు నేర్చుకుని,సంపాదించి, స్వయంగా నిలబడేందుకు ఉపయోగపడే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. సావిత్రిబాయి ఫూలే ఆశయాలు నేటికీ ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తున్నాయని, భవిష్యత్ తరాల నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
