ఎంబి శాలెం చర్చిలో మహిళా దినోత్సవ వేడుకలు..

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం అచ్చంపేట పట్టణంలోని ఎంబి శాలెం చర్చిలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామల సుధీర్ చర్చికి చెందిన సుమారు 30 మంది మహిళలను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో శాంతకుమారి, రెబ్కమ్మ, సంధ్య, పిస్కిలమ్మ, దేవేంద్రమ్మ, ఆశీర్వాదమ్మ, విక్టోరియా, మణెమ్మ, చర్చి పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply