- ఏపీలోట టీడీపీ భారీ స్క్రీన్ ఫెసిలిటీ..
- మంత్రి లోకేష్ ఆదేశం
- కేరింతలు, హర్షద్వానాలతో దద్దరిల్లిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం…
(విజయవాడ, ఆంధ్రప్రభ) : మహిళా ప్రపంచకప్–2025 ఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు ఉచితంగా వీక్షించేందుకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఏర్పాట్లు చేశారు. మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్దఎత్తున ఎల్సీడీ (LCD), భారీ లైవ్ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
భారత్–దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేడు జరగనున్న ఫైనల్ పోరును అభిమానులు పెద్ద సంఖ్యలో వీక్షించేందుకు వీలుగా ఈ లైవ్ స్క్రీనింగ్ ఏర్పాట్టు చేశారు. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా, క్రీడాభిమానులకు క్రికెట్ వీక్షణ అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో టీడీపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్యాన్ పార్క్ కు నగరవాసులు, క్రికెట్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఐసిసి వుమెన్ వరల్డ్ కప్ 2025 ఇండియా -సౌతాఫ్రికా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు మూడు బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
స్టేడియంలో బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ ను వీక్షించేందుకు విచ్చేసిన క్రికెట్ అభిమానులకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కొంత మంది క్రికెట్ అభిమానులు స్టేడియంలోని స్టాండ్స్ పై నుంచి వీక్షించారు. ఇండియా టీమ్ బ్యాటింగ్ చేసే సమయంలో బౌండరీలు, సిక్సర్లు కొట్టిన ప్రేక్షకులు చప్పట్లు , కేరింతలు కొడుతూ సందడి చేశారు.
మహిళ క్రికెట్ ను ప్రోత్సాహించాలనే ఉద్దేశ్యంతో ఏసీఏ ఏర్పాటు చేసిన ప్యాన్ పార్క్ అధిక సంఖ్యలో మహిళలు రావటం విశేషం, క్రికెట్ అభిమానులు ఇండియా టీమ్ కు సపోర్ట్ గా జాతీయ జెండాలను రెపరెపలాడితూ మద్దతుగా నిలిచారు. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన… అభిమానులు మ్యాచ్ ను ఆసక్తిగా తిలకించారు.
ఏసీఏ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలోనే కాకుండా వైజాగ్ లో రెండు కళాశాల్లో, కాకినాడలో ఒక కళాశాలో ప్యాన్ పార్క్ ఏర్పాటు చేసి ఇండియా-సౌతాఫ్రికా మ్యాచ్ చూసేందుకు బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేయటం జరిగింది.

