Women’s Commission | మహిళలకు ర‌క్ష‌ణ అవ‌స‌రం

Women’s Commission | మహిళలకు ర‌క్ష‌ణ అవ‌స‌రం

  • మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ

Women’s Commission | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ, భద్రత కల్పించడం అత్యవసరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ అన్నారు. రాజకీయ పార్టీలు, వృత్తి పరమైన సంస్థలలో పోష్ చట్టం అమలు అంశంపై మహిళా (Women) కమిషన్ కార్యాలయంలో న్యాయవాదుల సౌజన్యంతో అభిప్రాయాల పంచిక కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, పని ప్రదేశాల్లో మహిళల రక్షణపై సుప్రీం కోర్టు (Court) అనేక కీలక తీర్పులు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే చట్టాల అమలులో ఇంకా పూర్తిస్థాయి శ్రద్ధ అవసరమని అన్నారు. పని ప్రదేశంలో భద్రత లేదనే భావన మహిళల్లో ఇప్పటికీ ఉందని, రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్‌లు, విద్యా సంస్థలు సహా అన్నిరంగాల్లో పోష్ చట్టం అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు.

లైంగిక వేధింపుల ఘటనలు పెరుగుతున్నప్పటికీ కేసుల నమోదు తక్కువగా ఉండటం ఆందోళనకరమని తెలిపారు. సామాజిక కళంకం భయంతో చాలా మంది బాధితులు బయటకు చెప్పకుండా మౌనంగా ఉండిపోతున్నారని చెప్పారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, బార్ అసోసియేషన్‌లు కూడా పని ప్రదేశాల కిందకే వస్తాయని స్పష్టం చేశారు. ఈ అంశాలపై ప్రభుత్వానికి (Govt) నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. విద్యా సంస్థల్లో గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పించాలని, విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక దృష్టి అవసరమని అన్నారు. చిన్నతనం నుంచే సరైన ఆలోచనా విధానం పెంపొందిస్తే లైంగిక వేధింపుల వంటి సమస్యలు తలెత్తవని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) మాట్లాడుతూ, లైంగిక వేధింపుల నివారణకు సంబంధించి సుప్రీం కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. మహిళా చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయనే నెపంతో వాటిని నిర్వీర్యం చేయకూడదని అన్నారు. పని ప్రదేశం నిర్వచనాన్ని విస్తృతంగా తీసుకోవాలని, రాజకీయ పార్టీలు, క్యాంటీన్లు, బార్ అసోసియేషన్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పని ప్రదేశాలేనని చెప్పారు.

న్యాయవ్యవస్థలో మహిళల (Women) సంఖ్య పెరుగుతోందని, పని ప్రదేశాల్లో మహిళలకు భద్రతపై విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర న్యాయవాదులు కూడా చట్టాల పూర్తి అమలు, పాఠ్యాంశాల్లో అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు వంటి సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజేంద్ర ప్రసాద్ సిఫారసులతో కూడిన పత్రాన్ని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కు అందజేశారు.

Leave a Reply