AP | మ‌హిళ దారుణ‌హ‌త్య‌.. ముక్క‌లు ముక్క‌లుగా మృత‌దేహం

కశింకోట, మార్చి 18 (ఆంధ్రప్రభ) : కొన్ని హత్యలు జరిగిన తీరు వింటుంటేనే భయం పుడుతుంది. ఈ మధ్య కాలంలో హత్యలు జరిగే తీరు అత్యంత క్రూరంగా, భయంకరంగా ఉంటున్నాయి. తాజాగా అలాంటిదే మరో హత్య జరిగింది. కశింకోట పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ గుర్తు తెలియన మహిళ మృతదేహం సగం భాగం లభ్యమైంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బయ్యవరం వ‌ద్ద‌ పెట్రోల్ బంకు సమీపంలో బ్రిడ్జ్ కింద ఇవాళ ఓ డెడ్ బాడీని బెడ్ షీట్ తో కట్టేసి పడి ఉందని అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మహిళ సగం కింద భాగం, ఒక‌ చెయ్యి కనిపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వచ్చిన తరువాత కట్టేసి ఉన్న బాడీని ఓపెన్ చేశారు. బాడీ సగ భాగం, చెయ్యి ఉండటంతో చర్చనీయాంశంగా మారింది. సంఘటన స్థలానికి సీఐ అల్లుస్వామి నాయుడు, ఎస్ఐలు మనోజ్ కుమార్, లక్ష్మణరావు, క్లూస్ టీం చేరుకున్నారు.

Leave a Reply