ఇంట్లో ఎవరికీ చెప్పకుండా…
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామానికి చెందిన మాంకాల రేణుక(Mankala Renuka) (35) అదృశ్యం అయినట్లు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ ఈ రోజు తెలిపారు. వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన మంకాల బుచ్చయ్య భార్య అయిన మాంకాల రేణుక గత నెల 31న ఇంట్లో ఎవరికి చెప్పకుండా సాయంత్రం సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయింది.
నాటినుండి మహిళను తమ బంధువుల వద్ద, తమకు తెలిసిన వారివద్ద ఆరా తీయగా ఆచూకీ లభించకపోవడంతో మహిళ భర్త బుచ్చయ్య(Butchaiah) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు..

