శతచండీయాగం పూర్ణాహుతితో…

శతచండీయాగం పూర్ణాహుతితో…
మణికొండ, అక్టోబర్ 29 (ఆంధ్రప్రభ ) : మణికొండ స్వర్ణ దేవాలయంలో శతచండీయాగం పూర్ణాహుతి, మహా కుంభాభిషేకం ఘనంగా జరిగింది. శ్రీ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతీ స్వామీజీ వారి సువర్ణ హస్తములచే మహా కుంభాభిషేకం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామీజీ దివ్య అనుగ్రహ భాషణం చేశారు. ఈ దేవాలయంలో వేదపాఠశాల విద్యార్థులు వేద ఘోషాలతో యజ్ఞాన్ని మరింత భక్తి ప్రాధాన్యంగా చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, తలారి మల్లేష్, పూర్వ ధర్మాధికారి చేతుర్వేదుల చంద్రమౌళి, గౌరవ ప్రతినిధి కశ్యప్ చేతుర్వేది, మాజీ డీజీపీ అరవింద్ కుమార్, అడ్మినిస్ట్రేటర్ మురళీ, రామకృష్ణ రెడ్డి, శ్రీరాములు, శ్రవణ్, గంగాధర్ తదితరులు హాజరయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి దివ్య దర్శనం పొందారు.
