ఆ హామీతో.. ఆందోళన విరమణ..

ఆ హామీతో.. ఆందోళన విరమణ..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : క్వారీ, క్రషర్ లారీల రాకపోకలకు ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హామీ ఇచ్చారు. దుమ్ము, ధూళిని అరికట్టాలని గత తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తున్న కొండపల్లి అరుణానగర్ వాసులు మంగళవారం ఎమ్మెల్యే వసంతను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే వెంటనే క్వారీ యజమానులు, నివాసితులతో సమావేశం నిర్వహించారు.

అరుణానగర్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, దుమ్ము, ధూళి కాలుష్యాన్ని తగ్గించేందుకు నిత్యం రహదారి పై నీళ్లు చల్లాలని నిర్ణయించారు. ఈ చర్యలు వచ్చే ఆరు నెలల పాటు అమలులో ఉంటాయన్నారు. అరుణానగర్ ప్రాంత సమస్యలను ప్రజలు నేరుగా తనను కలిసి వివరించవచ్చని భరోసా ఇచ్చారు. దీంతో కొద్దిరోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనను విరమించారు.

Leave a Reply