పవన్ సూచనలతో.. క్షతగాత్రులను పరామర్శ..

పవన్ సూచనలతో.. క్షతగాత్రులను పరామర్శ..
శ్రీకాకుళం జిల్లా, (ఆంధ్రప్రభ)
పలాస – కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు దుర్మరణం పాలవ్వడం, 17 మంది గాయపడడం అత్యంత దురదృష్టకరమని నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీమతి లోకం నాగ మాధవి, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్, పాలకొండ ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కాశీబుగ్గ తొక్కిసలాటలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ సూచనలతో ముగ్గురు ఎమ్మెల్యేలు… ఘటనలో క్షతగాత్రులైన వారిని పలాస ఆసుపత్రిలో పరామర్శించారు.
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు జిల్లా కలెక్టర్, వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలు పరిశీలించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో జన సైనికుడు పారాడ త్రివేణి రావు సోదరి కూడా ఉన్నారు. ఆవిడను కూడా పరామర్శించి ఆత్మీయంగా ధైర్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్, సుడా చైర్మన్ కొరికిన రవి కుమార్, పార్టీ నేతలు శ్రీ పెడాడ రామ్మోహన్, శ్రీ సంతోష్ పండా తదితరులు పాల్గొన్నారు.
