గోదావరిఖని ఆంధ్రప్రభ : రామగుండంకు 250 కోట్ల రూపాయలతో అత్యాధునిక సౌకర్యాల(facilities)తో ఇంటిగ్రేటెడ్ పాఠశాల రాబోతుందని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ తెలిపారు. గోదావరిఖనిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో వారం రోజులుగా కొనసాగుతున్న జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) ప్రత్యేక శిబిరం(camp) ముగిసింది.
ఈ ముగింపు శిబిరానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. నియోజకవర్గాన్నిఎడ్యుకేషనల్ హబ్(Educational Hub)గా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని, దీనికోసం తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో పారిశ్రామిక ప్రాంతంలో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా రానున్నాయని చెప్పారు. విద్యాభివృద్ధికి తెలంగాణ ముఖ్యమంత్రి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉన్నారని తెలిపారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంతం విద్యారంగంలో అగ్రస్థానం(Top Location)లో నిలబెట్టేందుకు తాను ముందు ఉంటానని రాజ్ ఠాకూర్ వివరించారు. విద్యార్థులు తమ సమయాన్నిఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడితేనే మీరు ఈరోజు ఉన్నత చదువులు చదవగలుగుతున్నారని అది ఎన్నడూ మరవరాదని సూచించారు.
ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంతో ముందుకు సాగుతూ సమాజం గర్వించే విధంగా ఎదగాలని అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో మెలగాలని సూచిస్తూ… విద్యార్థులం(Students)తా కూడా నాయకత్వపు లక్షణాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ విద్యార్థులు సేవా దృక్పథాన్ని(Service Perspective)కలిగి ఉండాలని జీవితంలో ఉన్నత శిఖరాలు(Peaks) చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.