Winter | వామ్మో.. చలి

Winter | వామ్మో.. చలి

Winter, న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రతినిధి : వామ్మో.. దేశాన్ని (India) చలిగాలులు వణికిస్తున్నాయి. మొన్నటిదాకా వానలు.. ఇప్పుడేమో చలి చంపుతోంది. గత కొద్ది రోజులుగా చలి తీవ్రతతో జనాలు గజగజ వణికి పోతున్నారు. బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లే వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కాళ్లు.. చేతులు వణికిపోతున్నాయి. ఎముకలు కొరికే చలితో హడలెత్తిపోతున్నారు. ఇలాంటి తరుణంలో చలి పులి పై తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాదిలో వర్షాలతో పాటు చలి గాలులు కూడా ఉంటాయని తెలిపింది. రాబోయే రోజుల్లో దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో తీవ్రపరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. విపరీతమైన చలిగాలులు ఉంటాయని తెలిపింది.

మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ నవంబర్ 17 నుంచి 19 మధ్య ఉష్ణోగ్రతలు చాలా దారుణంగా పడిపోతాయని పేర్కొంది. ఇక సోమవారం పశ్చిమ మధ్యప్రదేశ్లోని రాజఢ్ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు నమోదైంది. దేశంలోనే అత్యంత చలి ప్రాంతం ఇదేనని వెల్లడించిందవి. ఇక ఛత్తీస్గఢ్, జార్కండ్, గుజరాత్లో కూడా తీవ్ర పరిస్థితులు ఉంటాయని చెప్పింది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కొన సాగుతున్నాయని వెల్లడించింది. తమిళనాడు, కేరళ, కోస్తా ఆంధ్రప్రదేశ్, (Andhra pradesh) యానాం, రాయలసీమ, అండమాన్, నికోబార్ దీవులలో తేలిక పాటి నుంచి మితమైన వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. నవంబర్ 18 నుంచి 22 వరకు తమిళ నాడులో భారీ వర్షాలు కురుస్తా యని.. నవంబర్ 17న అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

నవంబర్ 20 వరకు తమిళనాడు, కేరళ, (Kerala) మాహే, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరు ములు, మెరుపులతో కూడిన వర్షాలు కురు స్తాయని తెలిపింది. ఇక తెలంగాణలో కూడా చలి గాలులు (Cold winds) ఎక్కువగా ఉంటాయని తెలిపింది. ఇక నవంబర్ 17న కొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని నవంబర్ 18న అండమాన్ సముద్రం మీదుగా 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

Leave a Reply