- స్టేచర్ కాదు స్టేట్ ఫ్యూచర్ ముఖ్యం
- కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తాం
- మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్..
తెలంగాణకు రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రి అవుతానని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తొలిసారి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ప్రజటు మాకు ఓటు వేశారు. రెండోసారి ప్రేమతో మాకు ఓటు వేస్తారని సీఎం అన్నారు. శాసనమండలి వాయిదా పడిన తర్వాత శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని, తాను రెండోసారి ముఖ్యమంత్రి అవుతానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తన ఓటర్లని సీఎం రేవంత్ అన్నారు. తన పనిపై నమ్మకంతో ముందుకు సాగుతున్నానని తెలిపారు.
మొదటిసారి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాకు ఓటు వేశారు.. కానీ రెండోసారి మాపై నమ్మకంతో ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తాను కృషి చేస్తానని రేవంత్ అన్నారు. స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని వెల్లడించారు.
మొదటిసారి బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజలు మాకు ఓటు వేశారు, కానీ రెండోసారి మాత్రం మాపై నమ్మకంతో ఓటు వేస్తారని ఆయన అన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తాను కృషి చేస్తానని రేవంత్ తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచర్ తనకు ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తా అని మరోసారి స్పష్టం చేశారు. 25 లక్షల పైచిలుకు రుణమాఫీ జరిగింది.. ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్నా రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి మంది దాటిందని సీఎం అన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా.. మహిళలు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో తెలిపారు. గతంలో నేను చెప్పింది జరిగింది.. భవిష్యత్‌లోనూ నేను చెప్పిందే జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు త్వరలో చెల్లిస్తాం.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు వందశాతం బకాయిలు చెల్లిస్తాం. ఆదాయాన్ని పెంచి..పేదలకు పంచడమే మా విధానం’’ అని ముఖ్యమంత్రి అన్నారు. దక్షిణాదికి నష్టం జరగకుండా తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.