Wild animal | వేటగాళ్ల ఉచ్చులో కణతి..?

Wild animal | వేటగాళ్ల ఉచ్చులో కణతి..?

  • ఇద్దరు వ్యక్తులు విచారిస్తున్న అటవీశాఖ అధికారులు…

Wild animal | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంత పరిధిలోని గాజులపల్లి రేంజ్ పరిధిలోని బైరేని సెక్షన్ పరిధిలో ఓ కణతి వేటగాళ్ల చేతిలో బలైనట్లు అటవీ అధికారులకు సమాచారం అందింది. ఇవాళ‌ చలమ రేంజ్ పరిధిలోని గాజులపల్లి బీట్ బగ్గీ రోడ్డు దారి గుండా ఇద్దరు వ్యక్తులు కణతి మాంసంతో ద్విచక్ర వాహనంపై వస్తుండ‌గా అనుకోకుండా ఫారెస్ట్ ఉన్నతాధికారి వాహనానికి ఎదురవడంతో ఆపి చూడగా… మాంసం ఉన్నట్లుగా తెలుస్తుంది.

నిత్యం గాజులపల్లి బీటు పరిధిలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా కిందిస్థాయి అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాహనాలను అడవి లోపలికి పంపించడం వంటివి పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు. అది కూడా కణతిని వేటాడి చంపిన వారినే అధికారులు కూలీ పనుల నిమిత్తమై దారులు బాగు చేయడానికి పిలిపించినట్లు తెలుస్తోంది. కణతిని వేటాడి చంపిన ఇద్దరు వ్యక్తులను పట్టుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply