పార్లమెంట్ లో మాట్లాడని కవిత పాదయాత్ర దేనికి
కేటీఆర్ నా స్థాయి వ్యక్తి కాదు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఆంధ్రప్రభ, ప్రతినిధి /యాదాద్రి : కుటుంబ పంచాయితీలు, అవినీతి సంపాదనతో బీఆర్ఎస్ పార్టీ ఐదు ముక్కలు కానున్నదని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy VenkatReddy) అన్నారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు.

ఇంకా రెండు రోజులు వర్షాలు ఉన్నందున రైతులు ధాన్యం కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కప్పుకోవాలన్నారు. అధికారులు జాగ్రత్త పడాలని కోరారు. మూటకొండూర్ (Mootakondur) మండల కేంద్రంలో తహసీల్దార్, ఎంపిడివో, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి శంకస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కేసీఆర్ బీఆర్ఎస్ పెన్షనర్ల సంఘం అధ్యక్షుడని చెప్పారు.
కేటీఆర్ (KTR) నా స్థాయి తగిన వ్యక్తి కాదని, నే మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు గుంటూరులో చదువుకుంటుండని చెప్పారు. కవిత నే హరీష్ రావు ,సంతోష్ రావు కాళేశ్వరం పేరుతో దోచుకున్నారని, రామన్న జాగ్రత్తగా ఉండాలని బహిరంగగానే మాట్లాడిందని తెలిపారు.
పేదోళ్లకు ఒక రోజు కూడా సన్నబియ్యం పెట్టాలనే ఆలోచన లేని కేటీఆర్ గురించి మాట్లాడం అవసరం లేదన్నారు. ఒక్కనాడు కూడా పార్లమెంటు లో మాట్లాడని కవిత (kavita) పాదయాత్రలో జనానికి ఏం చేస్తుంది అంటూ హెద్దెవా చేశారు. మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

