మెగా పోటాపోటీ… రికార్డ్ బ్రేక్ చేసింది ఎవరో..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ క్రేజీ మూవీని తెరకెక్కిస్తున్నారు. పటాస్ సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తుండడంతో అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. చిరు మన శంకర్ వరప్రసాద్ గారు నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అలాగే చెర్రీ పెద్ది మూవీ నుంచి కూడా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. అయితే.. ఈ రెండు సాంగ్స్ యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. వ్యూస్ విషయంలో పోటీపడుతున్నాయి. మరి.. తండ్రీకొడుకులు చిరు, చెర్రీ.. ఈ ఇద్దరిలో ఎవరి సాంగ్ ఎక్కువ వ్యూస్ తో దూసుకెళుతుంది…? ఎవరు సరికొత్త రికార్డ్ సెట్ చేశారు..?

మెగా మ్యూజిక్ పోటీ…

మెగా

మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ నుంచి మీసాల పిల్లా.. అంటూ సాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. చిరంజీవి, నయనతార పై ఈ పాటను చిత్రీకరించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సాంగ్ విన్న వెంటనే నచ్చేలా ఉండడంతో యూట్యూబ్ లో దూసుకెళుతుంది.

మూడు వారాల టైమ్ లో 50 మిలియన్ వ్యూస్ సాధించింది. చాట్ బస్టర్ గా నిలిచింది. ఈ పాటకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది. సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ భారీ పాన్ ఇండియా మూవీని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చరణ్‌ కు జంటగా అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో.. స్పోర్ట్స్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది.

ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. ఈ భారీ చిత్రానికి సంగీతం సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 27న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

చికిరి చికిరి.. అంటూ సాగే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఏ.ఆర్. రెహ్మాన్ స్వరపరిచిన ఈ పాట కేవలం 35 గంటల్లోనే 53 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. జనాలకు విపరీతంగా నచ్చేయడంతో ట్రెండింగ్ లో టాప్ లో నిలిచింది.

ఒకే ఫ్యామిలీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోల పాటలు ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ అవ్వడం.. ఈ రెండు పాటలు యూట్యూబ్ ని షేక్ చేయడం విశేషం. దీంతో మెగా అభిమానులు తెగ సంబరపడుతున్నారు. అయితే.. ఈ మెగా మ్యూజిక్ పోటీలో చిరు సాంగ్ కంటే చెర్రీ సాంగే తక్కువ టైమ్ లో రికార్డ్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. మరి.. బాక్సాఫీస్ దగ్గర తండ్రీకొడుకులు చిరు, చెర్రీల సినిమాల్లో ఏ సినిమా మెప్పిస్తుందో.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుందో చూడాలి.

ఇది కూడా చదవండి.. శివ – నటీనటులు.. అప్పుడు – ఇప్పుడు

Leave a Reply