ఎవరు చేశారో?

పోచారం కొనుగోలు కేంద్రంలో అగ్ని ప్రమాదం
3 వేల గన్నీ బ్యాగులు దగ్ధం
నాగిరెడ్డిపేట నవంబర్ ఆంధ్రప్రభ : నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో శుక్రవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించి 3000 బ్యాగులు (కాలి సంచులు) దగ్ధమయ్యాయి. శుక్రవారం 7 కట్టల గన్ని బ్యాగులు కేంద్రానికి చేరుకోగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి వేసిన ట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేంద్రానికి 7 గన్నీ బాగుల కట్టలు వచ్చాయని అందులో 6 కట్టలు పూర్తిగా దగ్ధం అయ్యాయని ఐకేపీ సీసీ నారాయణ తెలిపారు. ఒక్కో గట్టలో 500 బస్తాలు ఉంటాయని మొత్తం 3000 బస్తాలు పూర్తిగా దగ్ధం కాగా సుమారు మూడు లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్టు ఆయన తెలిపారు. ఈ విషయమై ఐజేపీ అధ్యక్షురాలు చేత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నట్టు ఆయన వివరించారు.
