భావి తరాల దారులు ఎటువైపు…

మాడ్గుల, (ఆంధ్రప్రభ) : విద్యార్హత కలిగి నైపుణ్యత లేని యువత ఒక ప్రక్కన నిరుద్యోగంతో, యువత ఎటు పాలుపోని పరిస్థితుల్లో కుటుంబాలకు అండగా వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధికై ఎంచుకుంటే కష్టాలే పలకరిస్తున్నాయి. స్వశక్తిని గుర్తురెగని యువ ”విత్తు మంచిదైతే మొక్క మంచిదవదా” అన్న సామెతగా తన భవిష్యత్తును సమాజాన్ని మరచి రాజకీయ నాయకుల బిగి కౌగిలిలో సేదదీరడం న్యాయమా? వ్యక్తి, కుటుంభం, కేంద్రంగా సమాజ భవిష్యత్తుకై భాద్యత తీసుకోవాలిసిన వారే రాజకీయ నాయకుల ఎన్నికల దావత్‌లలో బీరు, బిర్యానీలకు ఓటును అనర్హుల ప్రలోభాలకు లోనయి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును దుర్వినియోగం చేస్తే జీవితాలు నిరుపయోగమైతాయని తెలియదా? బీరు, బిర్యానీలకు లొంగని యువ నాయకుల, కార్యకర్తల ఇంటి వద్దకు వెళ్లి భుజాలపైన చేతులు వేస్తే పులకరించిపోయి గత ఐదు సంవత్సరాలలో లెక్కపెట్టకుండా అవమానించిన తీరు అంతా మర్చిపోయి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని నాయకులకు దాసోహం అనడం భావ్యమా అని తమ తోటి మిత్రులు చీత్కరించిన సిగ్గనిపించదా.. జీవితాన్నిచ్చిన జీవితా అనుభవం కలిగిన గురుసమానులైన తల్లిదండ్రుల వెనుకబాటుకు కారణమైన అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకోవడానికి సైతం విముఖత కనబరుస్తున్న యువతను రాజకీయ నాయకులు అవధులు లేని ఆశల పల్లకిలో జోల పాడుతూ నిద్రపుచ్చుతున్నారు. యువత మేలుకో అమ్మను మించిన ప్రేమతో నడయాడిన నేలన నికార్సైన నాయకుని ఎన్నుకో పరివర్తన గల పౌరుడుగా జీవిత ప్రయాణం సాగించు.5

Leave a Reply