TRAFFIC| బుల్లెట్ సౌండ్ వస్తే చర్యలే..

TRAFFIC| బుల్లెట్ సౌండ్ వస్తే చర్యలే..

  • ట్రాఫిక్ ఏసీపీ బాణాల శ్రీనివాసులు

TRAFFIC| ఖమ్మం, ఆంధ్రప్రభ: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే బుల్లెట్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించమని ట్రాఫిక్ ఏసీపీ బాణాల శ్రీనివాసులు అన్నారు. ఇక నగరంలో బుల్లెట్ లు డుగ్గు.. డుగ్గు శబ్దాలు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పు చేసి.. వింత శబ్దం, అగ్ని మంట వచ్చే వాటిని అమర్చి, రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు 20 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకూ తొలగించి ఒక్కో వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధించారమని చెప్పారు. ఇప్పటికే సుమారు 1000 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకు తొలగించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆర్ఐ అప్పలనాయుడు పాల్గొన్నారు.

Leave a Reply