స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : యంగ్ హీరో తేజ సజ్జా – డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కాంబోలో వచ్చిన మిరాయ్ (Mirai) టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ థ్రిల్లర్(Fantasy thriller) పాజిటివ్ టాక్‌తో కాసుల వర్షం కురిపించింది.

సుమారు రూ.60 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ఫాంటసీ అడ్వెంచర్, థియేటర్ల(theaters)లో దాదాపు రూ.150 కోట్ల వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. థియేటర్లలో ఘనవిజయం సాధించిన మిరాయ్ కేవలం నెల రోజుల్లోపే ఓటీటీ(OTT)లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

జియో హాట్‌స్టార్ ఈ సినిమా డిజిటల్(digital) హక్కులను సొంతం చేసుకోగా… అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని ‘ఎక్స్’ వేదికగా అధికారికంగా వెల్లడించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు కృతి ప్రసాద్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. తేజ సజ్జా సూపర్ యోధుడి పాత్రలో మెప్పించగా, మంచు మనోజ్ బ్లాక్ స్వోర్డ్‌(Black Sword)గా విలన్ పాత్రలో అదరగొట్టారు. సీనియర్ హీరోయిన్ శ్రియా తల్లి పాత్రలో ఆకట్టుకోగా, జగపతి బాబు, జయరామ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు.

Leave a Reply