ఆంధ్ర‌ప్ర‌భ : పహల్గామ్ ఉగ్రవాద(Pahalgam terror attack) దాడికి ప్రతిస్పందనగా ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్(Operation Sindhur), భారత సైన్యానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఒక కీలక మలుపుగా నిలిచింది. కాగా, ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారి (Air Marshal Narmadeshwar Tiwari) తాజాగా ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.

ఈ ఆపరేషన్‌లో, భారత వైమానిక దళం 50 కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించింద‌ని ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ వెల్లడించారు. పాకిస్తాన్(Pakistan) ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్‌లోని కీలక లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని పేర్కొన్నారు.
ఎన్నో లక్ష్యాలు ఉన్నప్పటికీ, వాటిలో కేవలం 9 ప్రధాన లక్ష్యాలను ఎంచుకొని దాడి చేశామని తెలిపారు. అంత తక్కువ ఆయుధాలతోనే పాక్ సైన్యం తొక ముడిచింద‌ని.. భారీ నష్టాన్ని చవిచూసి, కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సి వచ్చిందని వెల్ల‌డించారు.

వ్యూహాత్మక ప్రణాళిక..

పహాల్గమ్ దాడి(Pakistan, Pahalgam attack) (ఏప్రిల్ 22) అనంతరం, భారత సైన్యం వెంటనే ప్రతిస్పందనకు సిద్ధమైందని… ఏప్రిల్ 29 నాటికి ప్రణాళిక పూర్తవగా, మే 5న ఆపరేషన్ అమలు చేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈమధ్య కాలంలో భార‌త‌ సైన్యం సరైన సమయాన్ని, స్థలాన్ని, లక్ష్యాలను ఖరారు చేసి, దాడులను విజయవంతంగా అమలు చేసింది.

ఈ ఆపరేషన్ విజయానికి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (Integrated Air Command and Control System) కీలకపాత్ర పోషించిందని ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ అన్నారు. దాడులు చేయడమే కాకుండా రక్షణను కూడా సమర్థంగా అందించిన ఈ సిస్టమ్, పాకిస్థాన్ ప్రారంభ దాడులను తట్టుకోవడంలో, గట్టి ప్రతిస్పందన ఇవ్వడంలో సహాయపడింది. పాక్ వెనక్కి తగ్గడానికి ఈ సాంకేతికత ప్రధాన కారణమని ఆయన అన్నారు.

ఆపరేషన్(Operation) సమయంలో ఢిల్లీలోని ఉన్నతాధికారుల నుంచి మూడు ముఖ్య ఆదేశాలు అందాయని తివారీ వెల్లడించారు. దాడి శత్రుదేశానికి స్పష్టంగా కనిపించేలా ఉండాలి, భవిష్యత్తులో పాకిస్థాన్ మరోసారి దాడులకు పాల్పడకుండా గట్టి హెచ్చరిక కావాలి, అలాగే భారత బలగాలు పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించాలి అనే సూచనలు అందాయ‌ని ఆయన వివరించారు.

భారత సైన్యం ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని.. వేగంగా, సమర్థంగా ప్రతిస్పందించగల శక్తి కలిగి ఉందని ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) స్పష్టంగా నిరూపించిందని ఎయిర్ మార్షల్ తివారీ తెలిపారు.

Leave a Reply