నిజామాబాద్ ప్రతినిధి, జులై 25(ఆంధ్రప్రభ) : గరీబోళ్ల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వ (Congress government) తీరు దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ (MLA Dhanapal Suryanarayana) ధ్వజమెత్తారు. అసెంబ్లీ సాక్షిగా మంత్రి పొంగులేటి (Minister Ponguleti) ఇచ్చిన హామీ ఏమాయే. సమీక్షలు సమావేశాలకే పరిమితమవుతారా అని ప్రశ్నించారు. గతంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి గత దసరా పండుగకే ఇస్తామని మాయమాటలు చెప్పిండ్రు… మళ్లీ దసరా వచ్చిన ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) వెంటనే అర్బన్ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
అదేవిధంగా నగరంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టి పంపిణీ చేయాలని తెలిపారు. వచ్చే దీపావళి పండుగ వరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడుతామని ప్రభుత్వానికి అర్బన్ ఎమ్మెల్యే డెడ్ లైన్ ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ మాట్లాడారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్ రూ మ్ ఇండ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉందని ఏద్దేవా చేశారు. ఇళ్లు ఇస్తే రెండో విడతలో జాగా లేని అర్హులకు ప్రభుత్వం కట్టించి ఇళ్లు ఇవ్వాలి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాని ఫోటో ఉండాలి…
మా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద ఇళ్లు ఇస్తోంది. కేంద్రం వాటా కలిపి ఇస్తున్న ఇండ్లపై ప్రధాని పేరు, ఫోటో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ, న్యాలమ్ రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.