ఎర్రోడిక (ఎర్రగుంట) ఎక్కడికి పోయింది..?

ఎర్రోడిక (ఎర్రగుంట) ఎక్కడికి పోయింది..?

  • కోట్ల విలువచేసే ఆరుఎకరాల 15గుంటల ఎర్రగుంట ఏమైనట్టు…
  • అధికారులు తేల్చాలి..
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ జాక్ కమిటీ బాలనగర్ మండల అధ్యక్షులు కటికే మధు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్
  • అమాయక కస్టమర్లను నిండా ముంచబోతున్న “సంజీవని వెంచర్” యాజమాన్యం
  • నేడు స్థానిక రైతులతో ఎర్రోడిక పై అభిప్రాయ సేకరణ చేపట్టబోతున్నట్లు వెల్లడి

బాలానగర్, ఆంధ్రప్రభ : బాలానగర్ మండల కేంద్రంలో సర్వేనెంబర్ 6లో కోట్ల విలువచేసే సుమారు 6 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమి ఏమైనట్టో సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, ముడా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉందని బాలానగర్ మండలానికి చెందిన బీసీ ఎస్టీ, ఎస్సీ జాబ్ కమిటీ మండల అధ్యక్షులు కటికే మధు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు బాలనగర్ గ్రామ శివారులో ఉన్నటువంటి సర్వేనెంబర్ 6లో పర్యటించి మీడియాకు తెలిపారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. 2015లో సుమారు 13 ఎకరాల 30 గంటలకు అనుమతి మంజూరు అయిందని, మిగతాది ఎర్రగుంటగా చూపించడం జరిగిందన్నారు. ఎర్రకుంటాను పట్టాగా మార్చుకునేందుకు అధికారులతో వెంచర్ యాజమాన్యం కుమ్మక్కై డబ్బులు ఇచ్చి మరీ పర్మిషన్ తెచ్చుకోవడం జరిగిందని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా 2019లో జిపి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన అప్రూవల్ ను ఆసరాగా చేసుకుని 2024లో ముడా అధికారులు కూడా అప్రూవల్ ఇవ్వడంపై ఆరోపిస్తున్నారు. అప్పటికి 2024, 25 సంవత్సరాలకు గాను సర్వేనెంబర్ 6లో ఎర్రకుంట చెరువులో చేపలు వదులుతున్నట్టు జిల్లా మత్స్యశాఖ అధికారులు సబ్సిడీ కింద కుంటకు కౌలుసిస్తు 1389 కట్టించుకున్నార‌ని తెలిపారు.

అంతేకాకుండా 2015, 2024లో ఎర్రకుంటను చేయించకుండా మూడాధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఈ వెంచర్ కు ఏ విధంగా అనుమతులు జారీ చేస్తారో ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి కేంద్రీకరించాలని, సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాకుండా మొదట ఇది స్పెక్ట్ర వెంచర్ గా ఉన్నప్పటికీ తర్వాత దీన్ని సంజీవని వెంచర్ యాజమాన్యం కోట్ల విలువచేసే ఎర్రకుంటాను మాయం చేసేసి అమాయక కస్టమర్ల చేత ప్లాట్లు కొనుగోలు చేయించి భవిష్యత్తులో వారిని నిండా ముంచబోతున్నట్లు వారు ఆరోపించారు.

ఈ వెంచర్ లో ఎవరు కూడా ప్లాటు కొనుగోలు చేయవద్దని, ఇది పక్కాగా గ్రామ నక్ష ప్రకారంగా ఎర్రకుంట స్థలమని, కోట్ల విలువ చేసే స్థలాన్ని కనుమరుగు చేయాలనే కాన్సెప్ట్ లో అధికారులు, వెంచర్ యాజమాన్యం ఉందని వారు వాపోయారు. అధికారులు ఇక్కడ ఇప్పటికైనా నూతనంగా జిల్లా కలెక్టర్ గా నియమితులైన వారైనా దృష్టి కేంద్రీకరించాలని, ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎర్రకుంట ఎర్రోడిక అని పిలవడే ఎర్రకుంటా వాస్తవ పరిస్థితులను గతంలో ఇక్కడ చూసినటువంటి రైతుల ద్వారా మీడియా ముందుకు రాబోతున్నారని, వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని కటికే మధు, శ్రీనివాస్ తదితరులు స్పష్టం చేశారు.

Leave a Reply