తిలా: శ్వేతా: తిలా: పితా:
తిలా: కాలాశ్చ సర్వత:
తిలేశు విష్టితం బ్రహ్మ
తిలా: సర్వ శుభావహా:
అని స్కాంద పురాణ వాక్యం. తెల్ల నువ్వులు, పచ్చ నువ్వులు, ఎర్ర నువ్వులు, నల్ల నువ్వులు అని నువ్వులు నాలుగు రకాలు. ఈ నువ్వులన్నీ కూడా శుభ ప్రదములే. తిలలు పరమపవిత్రములు, పరబ్రహ్మ స్వరూపాలు. భగవంతుడు లేడు అనుకునేవారికి తిలలే సమాదానం. నువ్వు గింజలో నూనె గానుగ పడితే కనబడుతుంది అలాగే ధ్యానం చేస్తే భగవంతుడు కనబడతాడు. సంక్రాంతికి, గ్రహణాలకు, ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో పితరులకు నువ్వులతో తర్పణం విడుస్తారు. శుభకార్యాలలో కూడా నువ్వులను వాడుతారు.
తిలలు యొక్క ప్రాముఖ్యం ఏమిటి?
