కుటుంబ సభ్యులు ఏమయ్యారు..?

కుటుంబ సభ్యులు ఏమయ్యారు..?

చౌటుప్పల్‌, ఆంధ్రప్రభ : ఆలనా పాలనా చూసేవారు లేక శిథిలావస్థలో ఉన్న‌ ఇంటిలో నివసిస్తున్న వృద్ధురాలును ఈ రోజు అధికారులు ఆశ్రమానికి తరలించారు. చౌటుప్పల్ మండలంలోని పంతంగి పంచాయతీ కార్యదర్శి చింతల శ్రీకాంత్(Chinthala Srikanth) తెలిపిన వివరాల ప్రకారం పంతంగి గ్రామానికి చెందిన వృద్ధురాలు దూడెల గౌరమ్మ(Dudela Gouramma) నివసిస్తున్న ఇల్లు శిధిలావస్థలో ఉండి వర్షాల కారణంగా కూలిపోయేలా ఉంది.

ఈ విషయాన్ని స్థానికుల సమాచారంతో గ్రామ పంచాయతీ కార్యదర్శి తెలుసుకోవడంతో వృద్ధురాలి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వృద్ధురాలితో కుటుంబల సభ్యుల‌ వివరాలు అడిగి తెలుసుకొని ఫోన్(phone) ద్వారా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వారు స్పందించికపోవడంతో తప్పని పరిస్థితిలో పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో ఆమెను ఆశ్రమానికి తరలించినట్లు శ్రీకాంత్ తెలిపారు.

Leave a Reply