తులసి, మారేడు ఇతర దళములను మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే ద్వాదశి, అమావాస్య గ్రహణ సమయాలలో, గ్రహణం తెల్లారి, సంక్రమణం వేళల్లో, సంక్రమణం తెల్లారి, పర్వదినాలలో పుష్పాలు, తులసి దళాలు మొదలైనవి కోయరాదు. ముఖ్యంగా అమావాస్య నాడు ఏ చెట్టును తాకరాదు. సూర్యభగవానుడి కిరణాలలో అమా అనేది ఒక కిరణం. ఆనాడు చంద్రుడు ఆ కిరణంలో నివసిస్తాడు. అమాయాం వసతి ఇది అమావాస్య’ అని అంటారు. ఆ కిరణంలో ఉండి చంద్రుడు సకల వృక్ష జాతికి ఆహారాన్ని అందిస్తాడు. చంద్రుడు సకల వృక్షములకు, ఓషధులకు, వనస్పతులకు పోషకుడు. వృక్షాలు ఆహారం తీసుకునే వేళ వాటిని తాకరాదు. మనం ఆహారం తీసుకునేటపుడు కూడా మనల్ని ఎవరూ తాకరాదు అలాగే మనము ఎవరినీ తాకరాదు. దీనినే శుచి, శుభ్రత, మడి, ఆచారంగా పిలుస్తారు. స్పర్షవలన, దృష్టి వలన చాలా అనర్దాలు కలుగుతాయని శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. శరీరం, వాక్కు పవిత్రంగా ఉండి దుష్ట భావానికి గురికాకూడదనుకుంటే ఇతరుల స్పర్షకు, దృష్టికి దరంగా ఉండాలి. తాకకూడని సమయంలో చెట్లను తాకితే వాటికి అనర్థం కలుగుతుంది కావున పైన చెప్పిన రోజుల్లో చెట్లకు దూరంగా ఉండటం వాటికి, మనకి కూడా మంచిది. ముఖ్యంగా దేవతా వృక్షాలు కోపించి శాపాలు కూడా ఇస్తాయని ప్రసన్నమైతే వరాలు ఇస్తాయని వృక్ష ఆరాధకులు తమ ఆచరణలో, అనుభవంలో చేసి చూపారు.
పుష్పాలు, తులసి ఆకులు మొదలగునవి కోయకూడని రోజులు ఏవి?
