West Asia war crisis : దాడి..ప్రతిదాడి Andhra Prabha News

West Asia war crisis : దాడి..ప్రతిదాడి Andhra Prabha News
- పశ్చిమ ఆసియాలో భయోత్పాతం
- ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం
- లెబనాన్‌లో విధ్వంసం…
- లక్షలాది మంది రోడ్డుపాలు
- వేలాది మంది మృతి
- 200 ఇరాన్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడి
- ఇరాన్ ప్రతీకారం… మిస్సైళ్లు, డ్రోన్లతో ప్రతి దాడి
- గల్ఫ్ లో యుద్ధ భయం…
- దుబాయ్, సౌదీ, ఒమన్‌లో అలజడి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

పశ్చిమాసియా (West Asia) అత్యంత భయానక స్థితికి చేరుకుంది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య నేరుగా దాడులు జరగడమే కాకుండా, మొత్తం గల్ఫ్ రీజియన్ యుద్ధ క్షేత్రంగా మారింది. ఇరు దేశాలు వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తామని హెచ్చరిస్తుండగా, ఇజ్రాయెల్ ‘తదుపరి దశ’ దాడికి సిద్ధమవుతోంది. గడచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF) పశ్చిమ ఇరాన్, మధ్య ఇరాన్లో 200 పైగా లక్ష్యాలపై గురిపెట్టింది. టెహ్రాన్, షిరాజ్అ, హ్వాజ్లోని బాలిస్టిక్ మిస్సైల్ లాంచర్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) ఆయుధ తయారీ కేంద్రాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఈ దాడులను ” ఆపరేషన్ రోర్ ఆఫ్ ది లయన్” (Roar of the Lion) గా ఇజ్రాయెల్ నిర్వహిస్తోంది. రాజధాని టెహ్రాన్‌లోని ఫెర్దోసి స్క్వేర్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. అరక్ (Arak) నగరంలో జరిగిన వైమానిక దాడిలో ఒక మహిళ, శిశువు మరణించారు.
West Asia war crisis : ఇరాన్ ప్రతిదాడి

ఇజ్రయోల్ మూకుమ్మడి దాడలకు ఇరాన్ అసలు వెనక్కి తగ్గటం లేదు. అంతే వేగంతో ప్రతీకార దాడులు జరుపుతోంది. ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్ల దాడితో ఉత్తర ఇజ్రాయెల్‌లోని జర్జిర్ (Zarzir) ప్రాంతాల్లో భవనాలు దెబ్బతిన్నాయి . 33 మంది గాయపడ్డారు. ఇరాన్ తన 44వ విడత మిస్సైల్ దాడులను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇవి ఇజ్రాయెల్ నగరాలతో పాటు ఎర్బిల్లోని అమెరికా బేస్‌లను లక్ష్యం చేసుకున్నాయి. ఇరాన్ ఈరోజు మధ్యాహ్నం 1:00 గంటకు ఇజ్రాయెల్ పై వందలాది డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. జర్జిర్ (Zarzir) హైఫా నగరాల్లో క్షిపణులు పడటంతో పలు భవనాలు కుప్పకూలాయి. 33 మంది పౌరులు గాయపడ్డారు. ఇరాక్ లోని ఎర్బిల్ ప్రాంతంలో అమెరికా సైనిక స్థావరాలపై కూడా దాడులు చేశాయి.
West Asia war crisis : గల్ఫ్ దేశాలలో గగ్గోలు

ఒమన్‌లోని సోహర్ ప్రావిన్స్‌లో ఒక డ్రోన్‌ను కూల్చివేయగా ఈ ప్రమాదంలో ఇద్దరు విదేశీయులు మరణించారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ (DIFC) సమీపంలో ఒక డ్రోన్‌ను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుళ్ల శబ్దాలు వినిపించాయని, ఒక భవనం స్వల్పంగా దెబ్బతిందని నివేదికలు పేర్కొంటున్నాయి. సౌదీ వైమానిక దళం రియాద్ మరియు ఇతర ప్రాంతాల వైపు వచ్చిన సుమారు 10 ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. ఇరాన్ రక్షణ శాఖ సమాచారం మేరకు శుక్రవారం దాడుల్లో 14 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ ఉద్రిక్తతల్లో సుమారు 1,300 మంది మరణించారని, 10,000 మందికి పైగా గాయపడ్డారని అంచనా.
West Asia war crisis : 4గురు అమెరికన్లు మృతి

ఇరాక్‌లో ఇంధనం నింపుకునే విమానం కూలిపోవడంతో నలుగురు US సర్వీస్ సభ్యులు మరణించారు. ఈ సంఘటన “శత్రు కాల్పుల వల్ల లేదా స్నేహపూర్వక కాల్పుల వల్ల కాదు” అని US సైన్యం తెలిపింది. కానీ ఈ విమానాన్ని తామే కూల్చిశామని ఇరాక్ మిలీషియా ప్రకటించింది. పశ్చిమ ఆసియాలో (ముఖ్యంగా ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రాంతాల్లో) కొనసాగుతున్న యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. దక్షిణ లెబనాన్‌లోని మియే మియే (Miyeh w Miyeh) గ్రామంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 8 మంది మరణించారు, 9 మంది గాయపడ్డారు. రాజధాని బీరూట్‌లోని జ్నా (Jnah) ప్రాంతంలో ఒకరు మరణించారు. బాషౌరా, జుకాక్ అల్-బ్లాట్ ప్రాంతాల్లోని భవనాలపై కూడా దాడులు జరిగాయి. గత 13 రోజుల్లో లెబనాన్‌లో ఈ రోజు వరకూ 690 మంది మృతి చెందారు. ప్రస్తుత యుద్ధంలో లెబనాన్‌లో దాదాపు 8 నుండి 10 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇరాన్లో కూడా ఒక లక్షకు పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది
ALSO READ : Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News
