welfare | ఉపాధ్యాయుల సంక్షేమమే ల‌క్ష్యం

welfare | ఉపాధ్యాయుల సంక్షేమమే ల‌క్ష్యం

  • తపస్ జిల్లా అధ్యక్షులు నరసింహ

welfare | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయుల సమస్యల సాధనకై, వారి సంక్షేమం(welfare) కోసం నిరంతరం తపిస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణపేట జిల్లా అధ్యక్షులు చంద్రకంటి నరసింహ అన్నారు. ఇవాళ‌ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన తపస్ కార్యవర్గ సమావేశం నిర్వ‌హించారు.

ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… పీఆర్పీ, డీఏలు పెండింగ్ బిల్లుల(Pending Bills) వంటి ఉపాధ్యాయ సమస్యల సాధనకై త్వరలో ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. మండల శాఖ అత్యంత చురుకుగా పనిచేస్తూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై పాటుపడుతున్నారని అభినందించారు.

ఎమ్మార్సీ సిబ్బందికి సన్మానం…

ఈ కార్యక్రమంలో మండల వనరుల కేంద్రంలో విధులు నిర్వహించే సరస్వతీ, అస్మత్, రాజశేఖర్, మహేష్, భీమన్నల సేవలను స్మరిస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, నాయకులు గుంపు బాల‌రాజ్, షేర్ కృష్ణారెడ్డి, జిల్లా సమన్వయకర్త నర్సింగప్ప, గ్రామ రేణుక భరత్, ఉప సర్పంచ్ రమేష్, మాజీ జడ్పిటిసి సూర్య ప్రకాష్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గోపాల్, గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య, జిల్లా కోశాధికారి కిషోర్ కుమార్, బాలుర ఉన్నత పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు మురళీ, మండల తపస్ నాయకులు వెంకట్ రెడ్డి, బన్నేష్, జయశ్రీ, విజయలక్ష్మి, ప్రతిభ, సుజాత అనిత వసుంధర, రమేష్, పృథ్వి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply