Welfare schemes | గెలుపు బాటలో జంజర్ల లింగన్న…
- సూరయ్య పల్లి ఎన్నికల్లో లింగన్న దే గెలుపు ఖాయం అంటున్న గ్రామస్తులు
Welfare schemes | మంథని, ఆంధ్రప్రభ : మంథని మండలం సూరయ్య పల్లి స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా జంజర్ల లింగన్న బరిలో ఉన్నారు. గ్రామస్తులు ఈసారి జంజర్ల లింగన్ననే సర్పంచిగా గెలిపించుకుంటామని ఆయన తరపున ప్రచారమే చేస్తున్నారు.
సర్పంచ్ గా గెలిచిన తర్వాత గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు(Welfare schemes) అమలు చేస్తానని ఆయన తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటెయ్యండి, బాధ్యతాయుతమైన పరిపాలన ప్రజలకు అందజేస్తానని ఆయన వివరించారు. గ్రామంలో రోడ్ల మరమ్మత్తులు, డ్రైనేజీ పునరుద్ధరణ, సంక్షేమ పథకాలు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అయన వివరించారు.
లింగన్న ప్రచార యాత్రలో ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. లింగన్నకు మద్దతుగా ప్రజలే ఇంటింటా ప్రచారాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. గడపగడప తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ లింగన్న స్థానిక సంస్థల బరిలో నిలిచారు. ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో(local body elections) గెలిచి ప్రజాసేవకు ముందు ఉంటానని ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.
ఎన్నికల్లో ఆశీర్వదించి, అవకాశం కల్పించాలని సేవకునిగా పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కష్టపడే వారిని ప్రజలు గుర్తించాలని, ప్రజల కోసం పనిచేసే వారు ఎవరో ప్రజలే తెలుసుకోవాలని ఆయన హితవు పలికారు. ఎన్నికల్లో బ్యాట్ ప్రభంజనం కొనసాగుతుందని ప్రజలే బహిరంగంలో చెప్పడం కోసం మెరుపు. ఈసారి ఖచ్చితంగా లింగన్న గెలవడం ఖాయమని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు.

