సంక్షేమ పథకాలే విజయ సోపానాలు..

సంక్షేమ పథకాలే విజయ సోపానాలు..

ఆలేరు, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి విజయ బాటలుగా మారుతాయని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు ఎండి బాబా ఆదివారం భీమా వ్యక్తం చేశారు.

మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, గృహ జ్యోతి వంటి పథకాలు ప్రజలకు ఎంతో చేరువయ్యాయని చెప్పారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీ రుణాలను అందించి కోటి మంది మహిళలను కోటీశ్వరుని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. కాంగ్రెస్ కు ఎన్నికలలో గొప్ప ఆదరణ దక్కడం ఖాయమని ఆయన చెప్పారు.

Leave a Reply